ఏపీ రైతులకు శుభవార్త.. త్వరలోనే చుక్కల భూముల పత్రాల పంపిణీ

-

ఏపీ రైతులకు శుభవార్త. త్వరలోనే చుక్కల భూముల పత్రాల పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి . చుక్కల భూములకు.సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు…జి.ఓ.విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. టిడిపి హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు.. వి.ఆర్.ఓ.నుంచి ఫైల్ రావాలంటే ఆరు నెలలు పట్టేదన్నారు.

చాలా భూములకు సబందించి పరిష్కారం లభించలేదు… రైతుల సమస్యలు చూసి జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చాలా చోట్ల రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు.. వీరికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయమని చెప్పారు.. చంద్రబాబు హయాంలో వీటిని నిషేధిత జాబితాలో పెట్టారని వివరించారు. రైతుల కష్టాలు చూసి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.. నెల్లూరు జిల్లాలోనే 40 వేల ఎకరాల మేర రైతులకు ప్రయోజనం కలగనుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే జిల్లాలో పర్యటించి రైతులకు పత్రాలు అందిస్తారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news