BREAKING : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

-

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేప‌టి క్రిత‌మే.. తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు.. ప‌రీక్షా ఫలితాల‌ను విడుద‌ల చేసింది. ఇవాళ విడుద‌లైన ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం ఫలితాల్లో బాలికలు 56 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే… బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం పరీక్ష ఫీజు చెల్లించగా… అందులో కేవ‌లం… 2 లక్షల 24 వేల 12 మంది మాత్ర‌మే పాస్ అయ్యారు.

అంటే ఈ లెక్క‌న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో.. కేవ‌లం 49 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. కాగా. గ‌త ఏడాది.. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో.. ప‌రీక్ష‌లు లేకుండా ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌ను సెకండియ‌ర్ కు ప్ర‌మోట్ చేసింది. ఇక ఇవాళ విడుద‌ల అయిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను… http://tsbie.cgg.gov.in/ అనే వెబ్ సైటు లో చూసుకోవ‌చ్చ‌ని బోర్డు తెలిపింది.

ఇక ఈ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు కానీ వారికి.. త్వ‌ర‌లోనే స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఇంట‌ర్ బోర్డు పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news