బ్రేకింగ్ : ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏకగ్రీవంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు పోటీకి దూరం కావడంతో కల్వకుంట్ల కవిత… గెలుపు ఏకగ్రీవం అయింది.

స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ ఇక్కడ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ.. దానిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఫామ్ 26 లో తప్పులు, బ్యాంకు అకౌంట్ వివరాలు తేడాగా ఉండటంతో స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఏకగ్రీవంగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. మరి కాసేపట్లోనే ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా విజయం సాధించడం తో … టిఆర్ఎస్ పార్టీ నాయకులు… వేడుకలు జరుపుకుంటున్నారు.