హ్యపీ బర్త్‌ డే అన్నయ్య.. కల్వకుంట్ల కవిత ఎమోషనల్‌ ట్వీట్‌

-

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఎందరో ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి హరీష్‌ రావు, టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఇలా ఎందరో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ చెల్లెలు కల్వకుంట్ల కవిత… తన అన్నయ్యకు శుభకాంక్షలు తెలిపారు. హ్యపీ బర్త్‌ డే అన్నయ్య..అంటూ కల్వకుంట్ల కవిత ఎమోషనల్‌ ట్వీట్‌ చేసి, కేటీఆర్‌ తో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్దఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్‌ పూర్తి ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news