మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజాను వివాహం చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మొదటిసారి కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో 2018లో తన కెరియర్ ను ప్రారంభించాడు. అయినా కూడా ఇప్పటివరకు కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే చేశారు . ఇకపోతే నటించింది కొన్ని సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు కళ్యాణ్ దేవ్. ఇక మొదటి సినిమాతోనే సైమా అవార్డును గెలుచుకున్న ఈయన సినిమా సినిమా కు నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే కళ్యాణ్ దేవ్ కి తన కూతురు నవిష్క అన్నా.. తల్లి అన్నా కూడా చాలా ఇష్టం. ఇకపోతే కొన్ని నెలల నుంచి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ దేవ్ కు కాస్త సమయం దొరకడంతో ఆయన కూతురు నవిష్క తన దగ్గరికి వచ్చిందని సమాచారం . ఇకపోతే తనకెంతో ఇష్టమైన తన కూతురు తన దగ్గరకు చేరుకోవడంతో పట్టరానంత సంతోషంలో మునిగితేలుతున్నాడు. అంతే కాదు కూతురితో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా వైరల్ గా నిలిచాడు. ఇక ఆ వీడియో కాస్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక కళ్యాణ్ దేవ్ తన కూతురుతో గడిపిన మధుర క్షణాలను వీడియో రూపంలో షేర్ చేయగా ఈ వీడియో పై పలువురు నేటిజల్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దీన్ని బట్టి చూస్తే శ్రీజ తో విడాకులు తీసుకోబోతున్నాడు అనే వార్తకు పులిస్టాప్ పడిందని చెప్పవచ్చు. నిజానికి గతంలో శ్రీజ అలాగే కళ్యాణ్ దేవ్ ఇద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు శ్రీజ పుట్టింట్లో ఉండడం కళ్యాణ్ దేవ్ తన అమ్మతో కలిసి ఉండడం లాంటివి చూస్తే నిజంగానే వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వైరల్ కాగా..తన కూతురితో కనిపించి తమపై వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టాడని చెప్పవచ్చు.
https://www.instagram.com/reel/CgjlgwxBerO/?utm_source=ig_web_copy_link