కల్యాణ్ కొత్త రూట్? టార్గెట్ అదేనా?

-

ఈ మధ్య రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పెద్దగా దూకుడుగా ఉండటం లేదనే సంగతి తెలిసిందే..ఏదో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏపీ పరిస్తితులపై కామెంట్స్ చేస్తున్నారు తప్ప….పెద్దగా రాష్ట్రంలో తిరగడం లేదు…ఏదో ఆ మధ్య రోడ్లపై గుంతలు విషయంలో పోరాటం చేశారు అంతే…మళ్ళీ ఏపీ సమస్యలపై పెద్దగా పోరాటం చేయలేదు…ఏపీలో ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కాకపోతే సోషల్ మీడియా వేదికగా మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు.
pawankalyan
pawankalyan

అయితే ఇలా కాస్త ఏపీ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయని పవన్..తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి కొత్త రూట్ ఎంచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నారసింహ యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. మొదట తెలంగాణలోని కొండగట్టు ఆలయం నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇక నిదానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 30 నరసింహా ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు.అయితే పేరుకు తెలుగు రాష్ట్రాల అభివృద్ది కాంకిస్తూ ఈ ఆలయాల యాత్ర అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు..కానీ రాజకీయంగా జనసేన మరింత బలపడేలా చేయడానికి, అలాగే పవన్ ప్రజల్లోకి రావడానికి కొత్త రూట్‌ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే తెలంగాణలో కూడా పవన్ యాత్ర ఉండనుంది…మరి అక్కడ కూడా రాజకీయంగా ఎదిగేందుకు పవన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

కానీ పవన్ మెయిన్ టార్గెట్ మొత్తం ఏపీ రాజకీయాలపై ఉంది…ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికే పవన్ చూస్తున్నారు. కాకపోతే హిందూ ఆలయాల సందర్శనని రాజకీయంగా వాడుకుంటారా? అనేది విశ్లేషకులకు డౌట్ వస్తుంది. మామూలుగా హిందూ ఎజెండాతో బీజేపీ రాజకీయం చేస్తుంది…మరి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్…అదే ఎజెండాతో వెళ్ళడమనేది కాస్త ఎవరికి అర్ధం కాని విషయంగా ఉంది. మరి ఈ ఆలయాల యాత్ర అనేది కేవలం దేవుడు కోసమేనా…లేక ఇందులో ఏమన్నా రాజకీయం ఉందా? అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. మరి చూడాలి ఆలయాల యాత్ర ద్వారా పవన్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకొస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news