ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిజాబ్ వివాదం కాకరేపుతోంది. కర్ణాటకలో ప్రారంభమైన ఈ వివాదం ప్రస్తుతం జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ కళాశాలలో ప్రారంభమైన వివాదం.. మెల్లిమెల్లిగా ఉడిపి, చిక్ మంగళూర్, బెళగావి, కొప్పెల, మాండ్య జిల్లాలకు కూడా పాకాయి. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని అభ్యంతరం తెలపిని మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు, కళాశాలకు రావడంతో ఉద్రిక్త వాతావరణ రాజుకుంది. నిన్న కర్ణాటకలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ వివాదం హైకోర్ట్ ముందుంది.
తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. అబద్ధాలు చెప్పని విద్యార్థుల మధ్య మతం విషపు గోడ కడుతున్నారు. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తమిళనాడుకు రాకూడదని.. ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశారు. ప్రగతిశీల శక్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని కమల్ హాసన్ అన్నారు.