ప్రియమయిన కేసీఆర్ కు కొందరే ప్రియం
అప్రియమయిన ఈటెల ఇప్పటికీ ఎప్పటికీ ఇక దూరం
ప్రియమయిన జగన్ కు కొందరే అప్రియం
కానీ ప్రియం అనుకున్న కొడాలి మాత్రం ప్రస్తుతానికి దూరం దూరం
ఈ వ్యూహం ఇక అంతు పట్టదు.. అంతు పోలదు
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రా రాజకీయమే కాస్త విభిన్నమా అని సందేహం వస్తోంది. కానీ ఎక్కడిక్కడ కుల రాజకీయాలు సమీకరణలు జట్టు కట్టి పాలిస్తున్న ప్రస్తుత సమయాన ఎవరికి వారే .. తమ మాట నెగ్గాలని తపిస్తున్నారు. ముందుగా అందుకు సోషల్ మీడియా ప్రమోషన్ ను బాగానే యూజ్ చేసుకుంటున్నారు. ఇక క్యాబినెట్ లో ఎవరు వచ్చినా రాకున్నా తన హవాకు లోటు లేదని చెప్పిన కొడాలి నాని పాపం సైలెంట్ అయి ఉన్నారు. పాపం అని రాయొచ్చా ! రాయొచ్చు ! ఎందుకంటే ఆయనకు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చినా వద్దన్నారు. అంతేకాదు పదవిలో ఉన్నప్పుడు ఎలా తిట్టారో ఇప్పుడు కూడా అలానే బూతులు తిడతామని మా మూతులు మూయలేరని కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అనే కమ్మనాయకుడికి అనిల్ కుమార్ అనే యాదవ నాయకుడు మద్దతుగా ఉన్నారు.ఇది ఏపీలో నెలకొన్న విపత్కర పరిణామాలకు సంకేతం. కానీ టీజీలో విభిన్నం.
కమ్మలే లేని సామాజిక సమీకరణలతో నింపిన జగన్ క్యాబినెట్ కన్నా ఒకనాడు విభేదించినా సరే గురువు చంద్రబాబు సామాజిక వర్గాన్ని నెత్తికెక్కించుకున్న దాఖలాలకు ఉదాహరణ తుమ్మల మరియు పువ్వాడ. ఖమ్మం జిల్లా కమ్మ నాయకులకే కాదు జూబ్లిహిల్స్ కమ్మ నాయకులకూ రెడ్డీల కన్నా ఎక్కువ ప్రయార్టీ ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఆయన దగ్గర కమ్మ నాయకులు బాగున్నారు. కానీ జగన్ దగ్గర బాలేరు. అంటే ఆయనకు వారి అవసరం లేదు అని కాదు. ఎన్నికల వేళ మాత్రమే వారిని అక్కున చేర్చుకుంటారనీ కాదు కానీ .,.. కొన్ని ఈక్వేషన్లలో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం రీజియన్ లో కమ్మ నాయకులకు మంచి పదవులు పార్టీ పరంగా ఇచ్చి తద్వారా తదుపరి క్యాబినెట్ లో తీసుకోవాలన్నది జగన్ యోచన కావొచ్చు. ఏదేమయినా పొద్దున లేస్తే చాలు కమ్మ నాయకుడు చంద్రబాబును అదే పనిగా తిట్టించే జగన్.. తన కొత్త వ్యూహం మాత్రం అంతుబట్టనీయడం లేదు.
ఆయనకు బ్రాహ్మణులూ అక్కర్లేదు. వైశ్యులూ అక్కర్లేదు మరియు అత్యంత అట్టడుగున ఉన్న సామాజిక సమీకరణాల్లో భాగంగా కొన్ని కులాల ప్రస్తావనే అక్కర్లేదు. అదే కేసీఆర్ మాత్రం భిన్నంగా వెళ్తూ పేరుకు పేరు వచ్చేలా,పదవికి పదవి కట్టబెట్టేలా చేస్తున్నారు. అదేవిధంగా ముదిరాజుల బిడ్డను తన మంత్రి వర్గంలో తీసుకున్న జగన్ ఆ విధంగా అనూహ్యంగా రజనీకి తన క్యాబినెట్ లో చోటు ఇచ్చి మార్కులు కొట్టేశారు. ఇదే సామాజికవర్గంకు చెందిన ఈటల మాత్రం
కేసీఆర్ దగ్గర అవమానాలు అందుకుంటూనే ఉన్నారు.