తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను క్రాస్ అవుతుతున్నాయి. దీంతో ప్రజలు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. ఎండల ధాటికి మధ్యాహ్నం వేళల్లో జన సంచారం తగ్గుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కాగా.. తెలంగాణలో వర్షాలు కురుస్తాయనే చల్లని కబురును తెలిపింది. దీంతో గత కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశ ఉంది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని ఇంటీరియర్ ప్రదేశాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉరుములు మెరుపులతో, ఈదురు గాలులతో కూడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ణ ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీలు ఉండవచ్చని వెల్లడించింది. వర్షాల వల్ల తెలంగాణ వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఏర్పడిండి.