కంగనా రనౌత్ పై కాంగ్రెస్ ఎమ్యెల్యే సంచలన వ్యాఖ్యలు… తన చెంపల కన్నాసున్నితంగా ఉంటాయంటూ..

జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోని పలువురు రాజకీయ నాయకుల లాగే.. తను కూడా బాలీవుడ్ హీరోయిన్ లపై వ్యాఖ్యలు చేశారు. సినీ నటి కంగనా రనౌత్‌ చెంపల కంటే సున్నితంగా ఉండేలా జమతారాలో 14 రోడ్లు నిర్మిస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఇర్ఫాన్‌ అన్సారీ వ్యాఖ్యలు చేశారు. “సినిమా నటి కంగనా రనౌత్ చెంపల కంటే జమతారా రోడ్లు సున్నితంగా ఉంటాయని, 14 ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని ఆయన అన్నారు.

గతంలో కూడా పలువురు రాజకీయ నాయకులు రోడ్లను బాలీవుడ్ హీరోయిన్ల చంపెలతో రోడ్లను పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. గతంలో హేమామాలిని చెంపలపై లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర మంత్రి మరియు శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ ఇటీవల తన అసెంబ్లీ నియోజకవర్గం జల్గావ్ జిల్లాలోని రోడ్లను నటిగా హేమా మాలిని చెంపలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు తర్వాత వివాదానికి దారితీసింది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణలు చెప్పారు. అంతకుముందు రాజస్థాన్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా కత్రినా కైఫ్ చెంపల్లాగా.. రోడ్లను మారుస్తా అని వ్యాఖ్యలు చేశారు.