గులాబీ సొంత డప్పు: పైన పటారం..లోన లోటారం!

తెలంగాణ ప్రజలకు తాము చేసినంత గొప్పగా ఎవరు చేయలేదని గత ఏడున్నర ఏళ్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యే దిశగా వెళుతుందని చెబుతూ ఉంటారు. సరే కేసీఆర్ నాయకత్వంలో పలు మంచి పనులు జరిగాయి…అలా అని పూర్తిగా మంచి జరిగిందని చెప్పుకోవడానికి లేదు. ఇంకా పలు రంగాల్లో తెలంగాణ వెనుకబడింది. గతంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రంలో అప్పులు పెరిగాయి. రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి. అన్నీ బాగుంటే ఇలాంటి జరగవు.

trs
trs

కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కూడా రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు..అటు నిరుద్యోగులకు అసలు ఉపయోగం లేదు. అసలు ఓ రకంగా తెలంగాణ వచ్చిందే నిరుద్యోగం అనే పునాది మీద…కానీ ఆ నిరుద్యోగం తెలంగాణ వచ్చిన పోలేదు. ఇంకా వివిధ రంగాల్లో సమస్యలు ఉన్నాయి. ఇలా పలు సమస్యలు ఉన్నా సరే అంతా బాగుందని చెప్పుకోవడం టీఆర్ఎస్ నేతలకు అలవాటు అయిపోయింది. ఇటీవల రైతు బంధు సంబరాలంటూ హడావిడి చేశారు. ఆఖరికి ట్విట్టర్‌లో ట్రెండింగ్ కూడా చేశారు. జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది.

కానీ ఇందులో వాస్తవం ఏంటంటే…రైతుబంధు డబ్బులు ఇంకా చాలామందికి అందలేదు. రైతు బంధు పథకానికి సంబంధించి ఇంకా పలువురికి డబ్బులు పడలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని మంత్రి కూడా ఒప్పుకున్నారు..త్వరలోనే అందరికీ వేస్తామని చెప్పారు.

అటు ఆస్క్ కేటీఆర్ పేరుతో తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ కార్యక్రమం పెట్టారు. అది కూడా బాగా హైలైట్ అయింది. అయితే విచిత్రం ఏంటంటే…రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో..అన్నీ కేటీఆర్‌ని అడిగారు. వరుసపెట్టి తెలంగాణ ప్రజలు కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నల తర్వాత క్లియర్‌గా అర్ధమైంది ఏంటంటే..తెలంగాణలో కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయా? అని….అంటే కేసీఆర్ పభుత్వం పైన పటారం…లోన లోటారం అన్నట్లే ముందుకెళుతుంది.