కన్నడ నటుడు ఎస్ విజయ్ కన్నుమూత

సరిగ్గా సుశాంత్ సింగ్ విషాదం జరిగిన ఏడాది కి మరో టాలెంటెడ్ నటుడు కన్నుమూసాడు. కన్నడ నటుడు ఎస్ విజయ్ కొద్ది సేపటి క్రితం చివరి శ్వాస వదిలారు. జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న ఎస్ విజయ్, 37ఏళ్ళ వయసులో రోడ్డు ప్రమాదంలో గాయపడి బెంగళూరులో మరణించారు. తన స్నేహితుడి బైక్ మీద ఇంటికి వెళ్తున్న ఎస్ విజయ్ కి శనివారం రాత్రిపూట ఆక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో తల కుడివైపుకి దెబ్బ తగిలింది. వెంటనే బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేసారు.

గాయం తీవ్రంగా అవడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న ఎస్ విజయ్ కి వైద్యులు చికిత్స అందించారు. ఐతే మెదడు కుడిభాగం బాగా దెబ్బతినడంతో రక్తం ఎక్కువగా కారిపోయింది. దీంతో పరిస్థితి విషమించి ఈ రోజు కన్నుమూసారు. విజయ్ కుటుంబ సభ్యులు ఆయన్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలెట్టిన ఎస్ విజయ్ ఎన్నో సినిమాలు చేసాడు. నాను అవనల్ల అవలు అనే సినిమాకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.