రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీ పై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి కూతురు నైమిషా 2015లో సత్యనారాయణ రెడ్డి పెళ్లి చేసుకుంది. సత్యనారాయణ మరెవ్వరో కాదండోయ్.. రెడ్డి మోటార్స్ యజమాని జి.వెంకట్ రెడ్డి కుమారుడు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ కంపెనీ గురించి రోజుకో నేత మాట్లాడుతున్నారు.

KA Paul
KA Paul

తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సొంత అల్లుడు సత్యనారాయణ మాక్సిబిన్ ఫార్మాసిటికల్ కంపెనీ లో డైరెక్టర్. ఎక్కడినుంచి వస్తున్నాయి డబ్బులు..? వేలకు వేల కోట్లు ఫార్మాసిటికల్ కంపెనీలకు.. అని ప్రశ్నించారు. కొడంగల్ లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు సేకరించడంపై ఫిర్యాదులు వచ్చాయి. వదిలేది లేదు.. త్వరలో వస్తున్నాను. మీరు తొందరపడకండి.. వీళ్ల అవినీతిని ఎక్స్ పోజ్ చేద్దాం. ప్రార్థిద్దాం.. న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు కే.ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Latest news