కరోనా కలకలం.. రాజస్తాన్ లో కప్పా వేరియంట్.

-

కరోనా కొత్త రూపాంతరాలు కొత్త రకాల సమస్యలను తీసుకువస్తాయేమోనన్న భయంతో ప్రజల్లో ఆందోళన చెలరేగుతూనే ఉంది. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందన్న నేపథ్యంలో జనాల్లో ఒక రకమైన అలజడి మొదలైంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ కప్పా వార్తల్లోకి వచ్చింది. రాజస్తాన్ లో 11మందికి ఈ కరోనావేరియంట్ సోకినట్లు తెలుస్తుంది. మొత్తం 11కేసులో రాష్ట్ర రాజధాని అయిన జైపూర్ లోనే 3 కేసులు వచ్చాయి. అల్వార్ నుండి 3, బర్మార్ నుండి 2, బిల్వారా నుండి 2కేసులు వచ్చాయి.

దీనికంటే ముందు ఉత్తరప్రదేశ్ లో రెండు కప్పా వేరియంట్ కేసులు వచ్చాయి. 109శాంపిల్లలో రెండు కేసులు కప్పా వేరియంట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. లక్నోకి చెందిన కింగ్ జార్జ్ ఆస్పత్రి చేపట్టిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. మిగతా 107శాంపిల్స్ అన్ని డెల్టా వేరియంట్ అని తేలింది. డెల్టా, కప్పా వేరియంట్లని గత ఏడాదిలోనే భారతదేశం గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news