రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న కరీనా కపూర్‌..యథావిధిగా షూటింగ్‌లకు హాజరవుతున్న కరీనా

ప్రముఖ హిందీ నటి కరీనా కపూర్ త్వరలో మరో అభిమానులకు మరో గుడ్ న్యూస్‌ చెప్పనుంది..వచ్చే కొద్దిరోజుల్లోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు కరీనా..అయితే, ఆమె అలాగే రెగ్యూలర్‌గా షూటింగులకు హాజరవుతున్నారు..చాలా మంది హీరోయిన్లు గర్భిణిగా ఉన్న సమయంలో తమ ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్తపడతారు,ఆరొగ్యంపై ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటారు.. కానీ, కరీనా కపూర్ మాత్రం ఇటువంటివి పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొంది..అంతేగాక, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో తాజాగా ఆమె పాల్గొంది. ఆ సమయంలో అక్క కరిష్మా కపూర్ కూడా ఆమె వెంటే ఉంది. కుర్చీలో కూర్చొని ఆమె హుషారుగా ఫొటోకు పోజులిచ్చింది కరీనా.