కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కాసేపటి క్రితమే.. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మే 10 న కర్ణాటక ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే.. May 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది ఎన్నికల సంఘం.
ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న పోలింగ్.. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇవాళ్టి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్ ఉంటుందని తెలిపింది కేంద్ర ఎన్నికల కమిషన్. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం బిజెపికి 119 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో 36 ఎస్సి,15 ఎస్టీ స్థానాలు ఉన్నాయి.
మే 24 తో అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. కర్ణాటకలో 5.21 కోట్ల ఓటర్లు ఉన్నారు.150 స్థానాల గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది బిజెపి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఒక్క లింగ,లింగాయత్ వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది బిజెపి. ఇప్పటికే 124 స్థానాలకు అభ్యర్థులు కాంగ్రెస్ ప్రకటించగా, 93 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జేడీఎస్. ఏప్రిల్ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటించనుంది బిజెపి.