కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కాసేపటి క్రితమే కర్ణాటక ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మే లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మరియు ఇతర పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవాలని వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా కర్ణాటకలో అధికారంలోకి రావాలంటే ఎన్నికలో మ్యాజిక్ ఫిగర్ గా 112 స్థానాలలో గెలవాల్సి ఉంది. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిపక్ష పార్టీపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈయన కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ బిచ్చగాళ్లలాగా ట్రీట్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచార సమయంలో నోట్లు వెదచల్లడాన్ని తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ మరియు ఆ పార్టీ నాయకులు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని మాట్లాడారు. అయితే కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ? ఎంత మాయమాటలు చెప్పినా అధికారం మాత్రం బీజేపీదే అంటూ నమ్మకంగా ఉన్నారు.