Dasara: కొకొరొక్కో.. రేపే దసరా సినిమా రిలీజ్.. సెట్ నుంచే కీర్తి, నానీల క్రేజీ ప్రమోషన్

-

నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ దసరా మూవీ కోసం రెండో సారి జత కట్టిన విషయం తెలిసిందే. రేపు ఈ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్​ కోసం ఈ జంట హైదరాబాద్, చెన్నై, కేరళ, ముంబయి, బెంగళూరు చక్కర్లు కొడుతోంది. వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.

అయితే తాజాగా కీర్తి సురేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలోనూ కీర్తి దసరా సినిమా ప్రమోషన్ చేసింది. ఈ వీడియోలో ముందుగా ఓ కోడి కనిపించింది. తర్వాత నాని ఎంటర్ అయి గుడ్​మార్నింగ్ చెప్పాడు. ఆ తర్వాత కీర్తి ఎంట్రీ ఇచ్చి విష్ చేసి రేపే దసరా సినిమా విడుదల అని ఇద్దరూ కలిసి చెప్పారు. ఈ వీడియోను చూస్తుంటే .. దసరా సినిమా సెట్​లో తీసినట్లుగా ఉంది. ఇందులో కీర్తి, నాని.. ఈ మూవీలో కనిపించిన గెటప్​లోనే కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news