కార్తీకదీపం ఎపిసోడ్ 1233: కోటేష్ బాబును తీసిన వీడియో సంపాదించిన సౌందర్య..కార్తీక్ వాళ్ల ఊరొచ్చిన ప్రియమణి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్యకు భారతీ ఫోన్ చేస్తుంది. మోనిత ఊరివదిలి వెళ్లిపోయింది..క్లీనిక్ అమ్మినట్లు తెలిసింది అంటుంది. సౌందర్య..మోనిత మా ఇంట్లోనే ఉందికదా..చూసి నేను కాల్ చేస్తాను అంటుంది. శ్రావ్యను అడిగితే..పొద్దున్నే ఎటో వెళ్లింది అత్తయ్య అంటుంది. మోనిత ఊరొదిలి వెళ్లిపోతోందంటే కార్తీక్ వాళ్లు ఎక్కడుతున్నాడో తెలిసిందా అనే ఆలోచనలో పడుతుంది సౌందర్య .

దీప ఇంట్లో..

దీప వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దిగాలుగా నిల్చుంటాడు. దీప రుద్రాణి వచ్చిందని మీరేమైనా కంగారు పడుతున్నారా అంటుంది. కార్తీక్ కంగారు ఏం లేదు..ఆవిడ ఏంటో ఏం అర్థంకావటం లేదు అంటాడు. దీప కార్తీక్ కి ధైర్యం చెప్పుంది. కార్తీక్ దీపతో నేనూ ఏదొక పని చేస్తాను దీపా అంటాడు. దీప వద్దంటుంది..పోనీ నీ పిండివంటకాలను మార్కెటింగ్ చేయనా అంటే దీప వద్దంటుంది. మరి ఏం చేయను దీప అంటే.. మీరు ఇక్కడ ప్రజావైద్యశాల పెట్టాలంటుంది దీప.

బస్తీలో మోనిత

సేమ్ టైమ్ కి అక్కడ మోనిత బస్తీలో ప్రజావైద్యశాల అనే బోర్డు పెట్టిస్తుంది. ‘నా కార్తీక్ ఆశీస్సులతో.. వంటలక్క ప్రజావైద్యశాల.. డా.మోనిత కార్తీక్’ అని రాసిన బోర్డ్‌ని చూసి వారణాసి వాళ్లు వస్తారు. మోనిత ఏదేదో సోది చెప్తుంది. వారణాసి ఏదేదో చెప్తుంటే ఉరుకుంటామా..పీకిపారేద్దాం అంటాడు. అక్కడొక అతను..ఈ ఇళ్లు తను కొన్నదిరా అంటాడు. దీప ఒకప్పుడు బస్తీలో ఉన్న ఇంటిని మోనిత కొని అక్కడ ఈ రచ్చ చేస్తుంది. నాది జాలి గుండె.. నాకు మానవత్వం, వగైరా ఎక్కువంటారు. దీప లేదు, నా కార్తీక్ లేడు..పాపం ఎక్కడికి వెళ్లారో తెలియదు, మీరంతా వాళ్లు లేకుండా దిక్కులేనివారు అవుతారని నేనొచ్చాను, నేనున్నాను కదా మనం అందరం కలిసి వాళ్లని వెతుకుదాం అంటుంది.

సౌందర్య ఇంట్లో..

సౌందర్య కార్తీక్ వాళ్ల గురించి ఆదిత్యతో మాట్లాడుతుంది. అన్నయ్య వాళ్లు లేకుండా ఎలా ఉంటున్నాం అనుకుంటారు. మోనిత కనిపించటం లేదేంటి అని ఆదిత్య అంటే…ఇంట్లోంచి వెళ్లిపోయిందంట పీడ పోయినట్టే అనుకుంటారు. మరోవైపు మోనితకి కార్తీక్ ఎక్కడున్నాడు తెలిసి వెళ్లి ఉంటుందంటావా అంటుంది సౌందర్య. కార్తీక్ ఆచూకీ తెలిసి ఉంటే అక్కడికి వెళ్లి వాళ్లని ఇబ్బంది పెడుతుందేమోనని నాకు భయంగా ఉందంటుంది సౌందర్య. ఇంతలో అక్కడకు వచ్చిన రత్నసీత.. మోనిత బస్తీకి షిప్ట్ అయిన విషయం చెబుతుంది. తనకేం పని అని సౌందర్య అంటే.. అక్కడ ఇల్లు కొనుక్కుని మోనితకార్తీక్ ప్రజావైద్యశాల అని ఆసుపత్రి స్టాట్ చేసిందంట మేడమ్ అంటుంది.

కట్ చేస్తే..బస్తీలో మోనిత ఎంత మాట్లాడినా అక్కడి జనం పట్టించుకోరు. ఈ ప్రజావైద్యశాల మీది..నాలో మీ దీపక్కను వెతుక్కోండి అంటుంది. లక్ష్మణ్..ఏంట్రీ దీమ్మకు ఈవిడకు పోలిక ఏంటి అని..వెళ్లిపోతారు. ఇంతలో బ్యాగ్ పట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది. నమస్తే అమ్మా… అరుంధతి మేడం పంపించారంటుంది. ఆ అమ్మాయితో పనులు అన్నీ చెప్తుంది. నాకొక పనిమనిషి ఉండేది..వాళ్ల ఊరువెళ్లిందిలే..తాడికొండ వెళ్లింది అంటాడు. తాడికొండ అంటే కార్తీక్ వాళ్లు వెళ్లిన ఊరే.

బాబుకి పేరు పెట్టబోతున్నాం.. రేపే పంతుల్ని రమ్మన్నాం అని కోటేష్, శ్రీవల్లి చెప్పగానే..బాబుని నేనుచూసుకుంటా మీరు వెళ్లండని చెబుతాడు కార్తీక్. అదేంటో నేను ఎత్తుకుంటే వీడు అస్సలు ఏడవడు అంటాడు. కార్తీక్ బాబుతో..నేను ఎత్తుకుంటే నువ్వు ఏడుపు ఆపడమేంట్రా విచిత్రం కాకపోతే అంటాడు.

మరోవైపు బస్తీలో ప్రజావైద్యశాల ఏర్పాటు చేశా అందుకే స్వీట్స్ చేయించా అంటూ ముందుగా సౌందర్యకు చెప్పి..ఆ నర్సమ్మతో అత్తయ్య, మావయ్యలకు స్వీట్ ఇవ్వు అంటుంది. వాళ్లు తీసుకోరు. ఇంతలో అక్కడకు వచ్చిన ఆదిత్య, శ్రావ్యకి మ్యాటర్ చెప్పి.. స్వీట్స్ ఇమ్మంటుంది. వాళ్లు తీసుకోరు. సర్లే నర్సమ్మా.. నేను చెప్పిన శుభవార్తతోనే కడుపు, మనసు నిండిపోయిందేమో అంటూ స్వీట్స్ తిని ఎంజాయ్ చేస్తుంది మోనిత. నా కార్తీక్ ఉంటే బాగుండు..గులాబ్ జామ్ తినిపించేదాన్ని అంటుంది. సౌందర్య ఏదో చేసేదానిలా లేచి..సీరయస్ గా రెండు డైలాగ్స్ వేస్తుంది. ఎక్కువ చేయకు మోనిత..నోర్ముయ్ అంటుంది సౌందర్య. నేను కొంచెం ఎక్కువే చేస్తానని మీకు తెలుసు కదా అంటూ.. ఈవిడ ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. వంటలక్క-కార్తీక్ అని బోర్డుపై పెట్టడంతో నా పుణ్యంలో వాటా వాళ్లకి కూడా వెళుతుందంటుంది. ఈ విషయం తెలిస్తే..అందరూ నా విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారేమో అంటుంది.

మోనితకి సౌందర్య క్లాస్

పెళ్లైన వాడిని ప్రేమించడం నువు చేసిన మొదటి తప్పు..దంపతులను విడదీయడం రెండో తప్పు, మా కుటుంబంలో లేనిపోని కలతలు సృష్టించి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశావ్ ఇది మూడో తప్పు, స్త్రీ జాతిలో ఆణిముత్యంలానీకు నువ్వు ఫీలవకు… ఆడవాళ్లు సిగ్గుపడే పనులే చేస్తున్నావ్. బస్తీకి వెళ్లి ప్రజావైద్యశాల పెడితే నీకు బ్రహ్మరథం పడతారనుకున్నావా. అక్కడ ప్రజల గుండెల్లో నా పెద్దకోడలు ఉంది. దీప-కార్తీక్ అంటే వాళ్లకి దైవంతో సమానం. నువ్వు ఆ బస్తీలో ఎన్ని కోతి వేషాలు వేసినా.వాళ్ల అభిమాన్ని పొందలేవు. వైద్యం అంటే అపురూపమైన సేవ..దాన్ని ప్రేమతో చేయాలి ..వృత్తికి కూడా అన్యాయం చేయొద్దు మోనిత అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎప్పటిలానే సిగ్గులేకుండా దులిపేసుకుని..మళ్లీ గులాబ్ జామ్ తింటుంది.

దీప వాళ్ల దగ్గరకు శ్రీవల్లి, కోటేష్ వచ్చి రేపు బాబు నామకరణానికి..పంతులు గారిని పిలిచాను అనటంతో.. బాబు బారసాలకి వంటలు చేస్తానని దీప… నేను పిల్లలు డెకరేషన్ చేస్తామని కార్తీక్ అంటాడు. మీరెంత మంచోళ్లు సార్ అంటారు శ్రీవల్లి-కోటేష్…అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

మంగళవారం ఎపిసోడ్

నీ బిడ్డని మేం దొంగిలించామా, నీపై పగసాధించాలని అనుకున్నామా… ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుందని.. కోటేష్ బాబును దొంగలించిన సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. మరోపక్క..దీప ఇంట్లో అంతా బారసాల ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంటారు.

-triveni

Read more RELATED
Recommended to you

Latest news