తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో ఉదయం 6గంటల నుంచి 7గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400కి.మీ.ల దూరంలో ఉండటం గమనార్హం.
తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు సహా ఆరుగురు మృతిచెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గ్రేహౌండ్స్ దళాలకు డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సహకారం అందించినట్లు సమాచారం.