తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, లేఖను చంద్రబాబుకు పంపించానని తెలిపారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ కాంగ్రెస్ తో ఆడుతున్న కుమ్మక్కు రాజకీయమే దీనికి కారణం. పరోక్షంగా టిడిపి అధిష్టానం కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతోంది. కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకొని తెలంగాణ మమల్ని నిర్వీర్యం చేశారు. ప్రజాక్షేత్రంలో ఏపీలో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ఏపీలో టీడీపీ ఆడుతున్న ఆటకు ప్రజలు ముగింపు పలుకుతారు అని కాసాని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ అలయెన్స్.. ఎలా సాధ్యం? చంద్రబాబు కోరితే ఖమ్మం మీటింగ్ పెట్టాను. తర్వాత నిజామాబాద్ లో మీటింగ్ పెట్టాలన్నారు. ఇంటింటికీ టీడీపీ అని, 41వ ఆవిర్భావ సభ పెట్టించారు. బాలకృష్ణ, లోకేశ్ లకు ఫోన్ చేస్తే లేపలేదు. లోకేష్ ఎందుకు ఇక్కడ ఎందుకు పెత్తనం చేస్తున్నారు ? హైదరాబాద్ లోనే ఉన్నా లోకేష్ నన్నుపట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఎలా చెబుతారు..? అని కాసాని తన ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయనివ్వకపోవడానికి కారణాలను చంద్రబాబు చెప్పడం లేదని కాసాని పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి దిగి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి సర్వశక్తులు ఒడ్డాల్సిన కీలకమైన సమయంలో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని మరోసారి ప్రశ్నార్ధకం చేసేదిగా ఉంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీలను పక్కనపెడితే వామపక్షాలు, బీఎస్సీ, జనసేన, ఇతర చిన్నా చితక పార్టీలు సైతం ఎన్నికల బరిలో నిలిచి చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం ఉండాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. 40 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండి తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి పాటుపడిన ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం సహేతుకం కాదని భావిస్తున్నాను. 2014 తర్వాత తెలంగాణ వాదం బలపడి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, అప్పటి మన పార్టీ ముఖ్య నేతలంతా వలసబాట పట్టడం. జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్లో పొత్తు పర్యవసానంగా 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 13 స్థానాల్లోనే పోటీ చేయడం వల్ల అంతటా నాయకత్వం చెల్లాచెదురై పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది అని కాసాని అన్నారు.