గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా తో ఫోనులో సమీక్షించారు ఎమ్మెల్సీ కవిత. లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే..గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తడిసి ముద్దవుతో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ మరియు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఏవిధంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు అంచనా వేస్తోంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫోన్లో కోరిన ఎమ్మెల్సీ కవిత. విద్యుత్, ఇతర మౌళిక సదుపాయల విషయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరిన కవిత. (2/4)@RaoKavitha @TelanganaCMO @trspartyonline @Arvindharmapuri pic.twitter.com/dvK5Bn2QsS
— Zee Telugu News (@ZeeTeluguLive) July 11, 2022