ఐదు రకాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి – కేటీఆర్

-

రాష్ట్రంలో ఐదు రకాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి అన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. మొదటిది హరిత విప్లవం తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. దీనికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పదివేల ఎకరాల్లో రావాలన్నారు. ఒకప్పుడు తెలంగాణలో చేపలు తక్కువగా దొరికేవని, ఇప్పుడు ఫిషరీస్ లో ఇండియా నెంబర్ వన్ గా మారిందన్నారు. కొత్తగా కట్టుకున్న రిజర్వాయర్లు మిషన్ భగీరథ తోనే ఇది సాధ్యమైందన్నారు.

మీట్ ప్రాసెసింగ్ రావాలని, మీట్ ఇండస్ట్రీ భారతదేశానికి కాక ఇతర దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కురుమ, గొల్ల సోదరులకు గొర్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి చేస్తున్నామన్నారు.

ఇన్వెస్టర్లు సంతోషంగా ఉంటే వాళ్లే మన బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్లకు వేధింపులు ఉండవని తెలియజేశారు. మరోవైపు మూతపడే దశకు చేరిన విజయ డైరీ ని ఈరోజు అభివృద్ధి రంగం లోకి నడిపించామని అన్నారు. కరెంటు కోసం ఇందిరాపార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని, ఇప్పుడు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నామని.. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉన్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news