చెయ్యిదాటితే మనదేశానికి ఎవరూ అన్నం పెట్టలేరు, దేవుడి దయే; కేసీఆర్…!

-

ఈ గండం నుంచి బయటపడాలి అంటే కచ్చితంగా స్వీయ నియంత్రణ అవసరమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల అవసరాల కోసం కొన్ని సడలింపులు అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి చేయి దాటితే మనం ఎం చెయ్యాలేమని… మన దేశంలో పరిస్థితులు దిగజారితే, కరోనా తీవ్రత పెరిగితే మన దేశానికి ఏ దేశం అన్నం పెట్టే పరిస్థితి ఉండదు అని కేసీఆర్ హెచ్చరించారు.

దాదాపు వంద దేశాలు తెలంగాణా కంటే చాలా చిన్న దేశాలన్న ఆయన… మన దేశానికి అన్నం పెట్టే స్తోమత ఏ దేశానికి లేదని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి లాక్ డౌన్ పాటిస్తామని అన్నారు. తిను బండారాలు, వంట నూనెలు కల్తీ చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలను ఎవరూ కూడా ఇబ్బంది పెట్టవద్దని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణాలో రైతే రాజని, వాళ్ళ హవా నడుస్తుందని స్పష్టం చేసారు.

అందరూ కూడా దస్తీలు, టవల్స్, ఇతర గుడ్డలు కట్టుకోవచ్చు అన్నారు. తెలంగాణాలో ఎవరు కూడా ఆకలి తో చనిపోవద్దని ఆయన స్పష్టం చేసారు. కంటోన్మెంట్ జోన్స్ లో ప్రజలకు నిత్యావసర సరుకులను ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు. కరోనా ను కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా కఠిన నిర్ణయాలు అవసరమని అన్నారు. ఏప్రిల్ 30 తర్వాత తగ్గాలని… అప్పుడు లాక్ డౌన్ ని దశల వారీగా ఎత్తేస్తామని అన్నారు.

కరోనా కేసులను ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ప్రసక్తే లేదని, ఎవరిని కూడా ఒకసారి టెస్ట్ చేసి వదిలేసే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. దేశంలో కరోనా పూర్తి కంట్రోల్ లో ఉందన్నారు. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉందని అందుకే మనం చాలా జాగ్రత్త పడుతున్నామని, మహారాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసి వేసి నిత్యావసర సరుకులను కూడా తీసుకునే అవకాశం లేదని, రెండు రోజుల్లో తీవ్రత పెరిగితే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.

మహారాష్ట్రలో తీవ్రత పెరిగితే మనని మన౦ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పరిస్థితి చూసి నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఎవరికి కరోనా వచ్చినా సరే గాంధీ ఆస్పత్రుల్లో ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే కరోనాకు చికిత్స జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ కేజీ తెలంగాణా ప్రభుత్వం కొంటుందని, దేశ చరిత్రలో ఒక సీజన్ పంట మొత్తం కొంటున్న రాష్ట్రం తెలంగాణా ఒకటే అని అన్నారు.

ఏ రైతు కూడా బాధ పడి, కంగారు పడవద్దని స్పష్టం చేసారు. తెలంగాణాలో ఉండే ఎక్కువ పంటలు మూడే అన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న అని ఈ మూడే తెలంగాణాలో 96 శాతం ఉన్నాయని అన్నారు. పప్పు శనగలను కొనాలని వ్యవసాయ మంత్రి అనడం తో కేంద్రం తీసుకోకపోయినా సరే తామే కొంటామని స్పష్టం చేసారు. అధికారులు అందరూ కూడా కరోనా పనిలోనే ఉన్నారని, ఈ నెల 30 తర్వాత వచ్చే నెల రేషన్ ఇస్తామని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news