కెసిఆర్ ఎంఐఎంతో కలిసి పాతబస్తీకి మెట్రోని రాకుండా అడ్డుకుంటున్నారు – కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

-

సీఎం కేసీఆర్ పాలన తీరుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పనికన్నా రాజకీయాలు ఎక్కువ చేస్తుందనిి విమర్శించారు. కెసిఆర్ కు దేశం, తెలంగాణ కన్నా కుటుంబమే ఎక్కువ అని అన్నారు కేంద్రమంత్రి. బియ్యం రీసైక్లింగ్ లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారనే అభియోగాలు వచ్చాయన్నారు. నీతి అయోగ్ మీటింగ్ కి ఎందుకు హాజరు కాలేదని మండిపడ్డారు.

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం లేదని, ఆవాస్ యోజన ఇల్లు కట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం తో కలిసి మెట్రో రైలు సర్వీసులను పాతబస్తీకి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాగ్ రిపోర్టుపై కేసీఆర్, కేటీఆర్ రిప్లై ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అన్న కేసీఆర్ ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ లోని బీజాపూర్ హైవే కి భూసేకరణ చేయకపోవడంతో పనులు జరగడం లేదు అన్నారు. దానికి 2017 లో కేంద్రం 924 కోట్లు కేటాయించిందన్నారు. ఆయుష్మాన్ భారత్ మూడేళ్ల తర్వాత అమలు చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news