సమైక్య రాష్ట్రంలో పర్యాటకం నిర్లక్ష్యానికి గురైంది.- సీఎం కేసీఆర్

-

తెలంగాణలో పర్యాటక అభివ్రుద్ధిపై సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రసంగించారు. తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. సమైక్య పాలనతో తెలంగాణ పర్యాటక ప్రాంతాలు నిర్లక్ష్యాయానికి గురయ్యాయని ఆయన అన్నారు. కేంద్రం కూడా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో అనేక కోటలు, గడులు, బుర్జులు తెలంగాన ప్రతీకకు చిహ్నంగా ఉన్నాయని వీటిని పర్యాటక ప్రాంతాలుగా అభివ్రుద్ధి చేాయాల్సి ఉందన్నారు. తెలంగాణలో అద్భతమైన జలపాతాలు ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలను గొప్పగా తీర్చిదిద్దుతాం.

kcr

తెలంగాణలో అద్భుతమైన సహజ అందాలకు నెలవు అని అన్నారు. గతంలో గోదావరి నదిపై ఎస్సారెస్పీ ఒక్కటి మాత్రమే ఉండేదని, గేట్లు ఎత్తితే ధవళేశ్వరం వరకు నీరు వెళ్లేదని, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ తో గోదావరి నది సజీవంగా ఉంటుందన్నారు. వీటితో పాటు పద్మఅవార్డులపై కూడా కేసీఆర్ స్పందించారు. పద్మ అవార్డ్ లకు అర్హులైన వారు తెలంగాణలో లేరా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పద్మ అవార్డులపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని అసెంబ్లీలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news