తెలంగాణ తరహాలో దేశంలో కూడా అభివృద్ధి జరగాలి…ఇదే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ స్లోగన్..అంటే తెలంగాణలో అదిరిపోయే అభివృద్ధి జరిగింది..అలాగే భారతదేశమంతా కూడా జరగాలని కేసీఆర్ చెబుతున్నారు..ఇది జరగాలంటే కేంద్రంలోని మోడీ సర్కార్‌ని గద్దె దించాలనేది కేసీఆర్ టార్గెట్..దాని కోసం ఇప్పుడు కేసీఆర్ దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని కలిసి ఏకం చేసి పనిలో పడ్డారు. కాలుకు బలపం కట్టుకుని మరీ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలని కేసీఆర్ కలుస్తున్నారు.
సరే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నారు..ఇందులో ఎలాంటి తప్పు లేదు..బీజేపీపై పోరాటం ఆయన వ్యక్తిగత రాజకీయం అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి..తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేనట్లు కేసీఆర్….కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ, కేంద్ర రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఉన్న సమస్యలని పరిష్కరించకుండా కేసీఆర్ దేశాన్ని ఏ మారుస్తారని విమర్శలు కూడా వస్తున్నాయి.
జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడం అనేది కేసీఆర్ ఇష్టం…కానీ రాష్ట్రంలో సమస్యలని పరిష్కరించకుండా ఉండటం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి…అటు నిరుద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి..అటు రైతుల ధాన్యం విషయంలో ఇంకా క్లారిటీ లేదు..ఇక నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా పోరాటాలు చేస్తే, వారిపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.
పైగా కేసీఆర్ సైతం రాష్ట్ర సమస్యల గురించి చర్చ రాకుండా..కేవలం జాతీయ రాజకీయాల గురించే చర్చ జరిగేలా చేస్తున్నారు…తెలంగాణలో ఏ సభ పెట్టినా సరే…అక్కడ కేంద్రంలోని బీజేపీనే టార్గెట్ చేసి రాజకీయం నడిపిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ సైడ్ అయిపోతున్నాయి. కాబట్టి కేసీఆర్ రాష్ట్రంలో సమస్యలని సరిదిద్ది దేశ రాజకీయాలపై దృష్టి పెడితే బెటర్ ఏమో..లేదా రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలియకుండా ఉండటానికే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారేమో.