మూడు ఏళ్లలో వైసీసీ ప్రభుత్వం విద్యారంగానికి మంచి చేశామని… చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా విద్యారంగాన్ని పట్టించుకోలేదని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అరకొర రీఎంబర్స్మెంట్ ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో విద్యాదీవెన వంటి పథకాలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే జీర్ణించుకోలేక ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి వీటితో పాటు చంద్రబాబు కలిసి ఓ సిండికేట్, దొంగలముఠా అని విమర్శించారు. మహాభారతంలో దుష్ట చతుష్టయంగా వీరు మారారని జగన్ విమర్శించారు. వీళ్లు ప్రభుత్వం మంచి చేస్తే జీర్ణించుకోలేరని… కడుపు మంట అని, అబద్దాలు చెబుతారని, గోబెల్స్ ప్రచారం లాగా ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెబుతూ.. ఈదుష్ట చతుష్టయం చేస్తుందని జగన్ విమర్శించారు. టీడీపీ గుడులను ధ్వంసం చేస్తే మనం గుడులు కట్టామని అన్నారు. రథాలను తగలబెడితే మనం రథాలను నిర్మిస్తున్నామని జగన్ అన్నారు. వాలంటరీ వ్యవస్థతో సుపరిపాలన తీసుకువచ్చామని దేశానికి ఆదర్శంగా నిలిచామని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని జగన్ అన్నారు.
మహాభారతంలో దుష్ట చతుష్టయంగా ఆ నలుగురు: సీఎం జగన్
-