KCR hospitaized: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి చెకప్ కోసం హైదరాబాద్ AIG ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు.

కేసీఆర్ నిన్న(శుక్రవారం) కూడా కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. అయితే, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్ సై బర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు.