ఈ రోజు తెలంగాణాలో జరిగిన BRS ఆవిర్భావ సమావేశం ముగిసింది. ఈ సభ మొత్తం అయిదు గంటల పాటు జరుగగా, ఈ సమావేశానికి 270 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో రాజకీయ పరమైన చాల అంశాల గురించి ప్రస్తావన చేసి తగు సూచనలు నేతలకు కేసీఆర్ ఇచ్చారు. ఇక కొత్తగా ఏర్పడిన BRS ను దేశమంతటా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న విషయంపైన సైతం చర్చ జరిగింది. ఇక సమీప కాలంలో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకులు అంతా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ, కార్యకర్తలను సరైన దారిలో వెళ్లేలా చూసుకోవలసిన బాధ్యత మీదే అన్నారు కేసీఆర్.
ఇక తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికలు రచించి మెజారిటీ సీట్ లను BRS కు వచ్చేలా పనిచేయాలని అందరికీ చెప్పారు.