కెసిఆర్ ఫైటర్ కాదు చీటర్ – లక్ష్మణ్

-

తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలన్నారు బిజెపి రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్. కెసిఆర్ ఫైటర్ కాదు చీటర్ అని, రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కమ్ లకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని అంధకారం చేసే దుస్థితి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ విజయ సంకల్ప సభ షాక్ నుండి తేరుకోవడానికి కేసీఆర్ కు వారం రోజులు పట్టింది అని ఎద్దేవా చేశారు.

పుత్ర వాత్సల్యంతో ఆర్జెడి, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఎలా పతనమయ్యాయో.. రేపు టిఆర్ఎస్ కు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు బీజేపీ నేత లక్ష్మణ్.తెలంగాణ ప్రజలకు అండగా ఉండి, కెసిఆర్ అవినీతిని బట్టబయలు చేస్తానన్నారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ఒక రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతాను అన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను పార్టీ గుర్తించి రాజ్యసభ సభ్యుడిని చేస్తే కెసిఆర్ ఎందుకు అంత ఆందోళనకు గురి అవుతున్నాడు అని అన్నారు.

ప్రజల నుండి వచ్చిన నేను, ప్రజల కోసం పని చేస్తాను తప్పా.. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని తండ్రి చాటు బిడ్డగా అమెరికా నుండి వచ్చిన వ్యక్తిని కాదని చురకలంటించారు. ప్రజలు కెసిఆర్ పాలన పట్ల విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news