క‌విత ఫ్యూచ‌ర్‌పై కేసీఆర్ షాకింగ్ డెసిష‌న్‌..!

-

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ ముగ్గురు కీలక నేతలు హరీష్ రావు – కేటీఆర్ – కవిత. ఈ ముగ్గురు కెసిఆర్ కు కావలసిన వాళ్లే. హరీష్ రావు మేనల్లుడు కాగా…. కేటీఆర్, కవిత కెసిఆర్ వారసులు. కెసిఆర్ రెండోసారి సీఎంగా గెలిచాక‌ కొన్ని నెలల పాటు ఈ ముగ్గురిని దూరం పెట్టారు. గత క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ హరీష్ కు ముందుగా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక నిజామాబాద్ ఎంపీ కవిత పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఈ ముగ్గురిని కెసిఆర్ పక్కన పెట్టడంతో తెలంగాణ రాజకీయాల్లో కొన్ని నెలల పాటు ఎన్నో సందేహాలకు తావిచ్చిన‌ట్ల‌య్యింది.

ఎట్టకేలకు తాజా క్యాబినెట్లో హరీష్, కేటీఆర్ కు మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో చాలా సందేహాలకు ఆయన పెట్టేశారు. ఇక ఇప్పుడు కుమార్తె క‌విత విషయంలో మాత్రం ఆయన సస్పెన్స్ మెయింటైన్ చేయటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడంతో క‌విత మానసికంగా డిఫెన్స్‌లో ప‌డిపోవ‌డంతో పాటు నిజామాబాద్ వైపే రాలేదు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఆమెను హుజూర్‌న‌గ‌ర్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి భార్య ప‌ద్మావ‌తి మీద నిల‌బెట్టి పార్టీ త‌ర‌పున పోటీ చేయిస్తార‌ని చాలా మంది అనుకున్నారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా హుజూర్ నగర్ లో సైదిరెడ్డియే అభ్యర్థిగా ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు క‌విత విష‌యంలో ఏం చేస్తున్నార‌న్న‌ది చూడాలి. కేసీఆర్ కుమార్తె కోసం ఏదైనా చేయాల‌నుకుంటే ఆయ‌న ముందు రెండే ఆప్ష‌న్లు ఉన్నాయి.

క‌విత‌కు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీ రాజకీయాల్లో పంపడం.. లేదంటే మంత్రిగా చేరిన కేటీఆర్ చేపట్టిన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కవితకు ఇవ్వడం. క‌విత ఎంపీగా ఐదేళ్ల పాటు ఢిల్లీ రాజ‌కీయాల్లో పార్టీ ప‌రంగా త‌న‌దైన స్టైల్లో చ‌క్రం తిప్పారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం లోక్‌స‌భ‌లో త‌న వాయిస్ వినిపించారు. ఇక ఇప్పుడు కేసీఆర్ మ‌రోసారి ఆమెను రాజ్య‌స‌భ‌కే పంపాల‌ని భావిస్తున్నార‌ట‌. ఏదేమైనా క‌విత‌కు పార్టీ ప‌రంగా ల‌భించే ప్ర‌యార్టీ ఏంటో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news