కేసీఆర్ : జ‌గ‌న్ తో స్నేహం చెడిందా?

-

రాజ‌కీయంలో రాజ‌కీయం మాత్ర‌మే ఉంటుంది అనేందుకు, ఉండాలి అని చెప్పేందుకు నిర్థార‌ణ చేసేందుకు ప‌రిణామాలు ఎన్నో ఉదాహ‌ర‌ణగా నిలుస్తాయి. తార్కాణాలు అవుతాయి. సంబంధిత రుజువు లోనే రాజ‌కీయ పార్టీలు త‌మ మ‌నుగ‌డ‌ను కోల్పోవ‌డ‌మో లేదా ప‌ట్టు నిలుపుకోవ‌డ‌మో చేస్తాయి. తాజాగా కేసీఆర్ త‌న‌దైన రాజ‌కీయం షురూ చేశారు. దేశంలో రాజ‌కీయ శ‌క్తులు అన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయ‌నుకోవ‌డం భ్ర‌మ అని, తాను పోరాడి దేశం నుంచి బీజేపీని గెంటివేస్తాన‌ని అంటున్నారీయ‌న.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్ప‌టిదాకా రాష్ట్రాల‌కు ద‌క్కించిన హ‌క్కులేవీ లేవ‌ని అంటోంది తెలంగాణ రాష్ట్ర స‌మితి. ఈ నేప‌థ్యంలో సొంతంగా ఓ జాతీయ పార్టీ పెడ‌తాన‌ని అంటున్నారు కేసీఆర్. అదేవిధంగా సెక్యుల‌ర్ శ‌క్తుల ఏకీక‌ర‌ణ‌లో భాగంగా జ‌గ‌న్ తో ఆయ‌న వెళ్తారా.. ఎందుకంటే ఇప్ప‌టికే శివ‌సేన‌తో ఆయ‌న భేటీ కానున్న విష‌యం నిర్థార‌ణ‌లోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ బాపుతో జ‌గ‌న్ ఉంటారా ? ఉండ‌రా? లేదంటే బీజేపీ అనే పెద్ద రాజ‌కీయ శ‌క్తి ఇచ్చే బెదిరింపుల‌కు జ‌గ‌న్ లొంగిపోయి ఉంటారా? ఇవే ప్ర‌శ్న‌లు బ‌లీయంగా వినిపిస్తున్నాయి ఇవాళ..

కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకునేం దుకు సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగిం చండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం.. అని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే అన్నారు. ఈ నెల 20 న వారిద్ద‌రూ భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి భేటీ అన్న‌ది ప్రాధాన్యం ద‌క్కించుకుంది. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ కు జ‌గ‌న్ కు మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాలు ఏమ‌య్యాయి అన్న వాద‌న కూడా ఉంది.

ఒక‌ప్పుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం కాస్తో కూస్తో జ‌గ‌న్ కుటుంబంపై కేసీఆర్ సానుభూతితోనే ఉన్నారు.కాంగ్రెస్ ను స‌మ‌ర్థం గా ఎదుర్కొని సీఎం కుర్చీలో కూర్చొన్న జ‌గ‌న్ ను చూసి స్వ‌యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి విచ్చేసి అభినంద‌న‌లు తెలిపారు. అదేవి ధంగా జ‌గ‌న్ పోరాట స్ఫూర్తిని కూడా చాలా సంద‌ర్భాల్లో చూసి ముచ్చ‌ట‌పడ్డారు కూడా! పిల్లాడ‌యిన జ‌గ‌న్ పెద్దాయ‌నకు భ‌లే న‌చ్చాడు.కానీ ఇప్పుడు న‌చ్చ‌డం లేదు ఎందుక‌ని? ఎందుకంటే అది రాజ‌కీయం క‌నుక !

Read more RELATED
Recommended to you

Latest news