కేసీఆర్ కారణజన్ముడు… కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా..- మంత్రి హరీష్ రావు.

-

కేసీఆర్ కారణజన్ముడని..తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్పించాడు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు.. సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని.. మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలను ఒక్కటొక్కటిగా నిజం చేసిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నాడు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని అన్నారు. గుక్కుడు తాగు నీటికి అల్లాడిన తెలంగాణ.. ప్రస్తుతం సాగు నీటితో ఆకుపచ్చగా మారిందని ఆయన అన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో అన్నింటా తెలంగాణ.. భారత దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఆయన అన్నారు. గతేడాది ముఖ్యమంత్రి జన్మదినాన రంగనాయక సాగర్ నుంచి నీటిని విడిచామని.. మళ్లీ ఈ ఏడాది పుట్టిన రోజున రంగనాయక సాగర్ నుంచి నీటిని వదలడం చాలా సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు. రంగనాయక సాగర్ నీటి వల్ల సిద్ధిపేట, సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాడ్ నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుతుందని హరీష్ రావు అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news