డ్రగ్స్ కట్టడికి కేసీఆర్ సంచలన నిర్ణయం.. 1000 మందితో స్పెషల్ పోలీస్ టీం !

-

డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ ను సిఎం కెసిఆర్ ఇవాళ నిర్వహించారు. రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లా ల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాల పై ఈ సందర్భంగా చర్చ నిర్వహించారు కెసిఆర్.

పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం అయింది. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం కెసిఆర్ ఆదేశించారు. కఠిన చర్యల అమలకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 (వెయ్యి) మంది తో కూడిన ప్రత్యేకంగా .. ‘‘ నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ’’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ని అదేశించారు సిఎం కెసిఆర్. డీజీపీ ఆధ్వర్యంలో పని చేయనుంది ఈ విభాగం.డ్రగ్స్ ను మరియు వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం పనిచేయనుంది ఈ విభాగం.

Read more RELATED
Recommended to you

Exit mobile version