తెలంగాణలో బీజేపీని ఉచ్చులో పడేసిన కేసీఆర్…?

-

తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఆ పార్టీ నాయకులు ఆ పార్టీని ఏ విధంగా ముందుకి తీసుకువెళ్తారు…? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కాస్త కష్టంగానే ఉంది. నాలుగు ఎంపీ స్థానాలను తెలంగాణలో గెలిచిన ఆ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి తీసుకుని బలపడాలని భావించింది. కేసీఆర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ అవకాశం బీజేపీకి దక్కలేదు. ఆ తర్వాత ఆర్టీసి సమ్మె, క్యాబ్ సమ్మె, గవర్నర్ ద్వారా పట్టుపెంచుకోవాలని బీజేపీ భావించడం వంటివి, కేసీఆర్ కి అంతగా రుచించలేదు.

కాంగ్రెస్, బీజేపీ రెండింటికి సమ దూరం పాటిస్తున్నా అని కేసీఆర్ చెప్పినా ఆయన ఎక్కువగా బీజేపీకి దగ్గరగానే ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ కి ఆయన దూరం జరిగారనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్నార్సి, క్యాబ్ విషయంలో బిజెపికి కేసీఆర్ వ్యతిరేకంగా వెళ్ళారు. తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ బలపడాలి తెలంగాణలో అంటే దాదాపు 30 శాతం వరకు ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు దగ్గర చేసుకోవాలి.

ఎన్నారి, క్యాబ్ అమలు చేస్తే అది జరిగే పని కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కూడా తక్కువగానే ఉంది. ఇప్పుడు ఆ రెండు అమలు చేస్తే బీజేపీకి దారులు మూసుకుపోయినట్టే, తెలంగాణలో హిందుత్వ ప్రభావం తక్కువ కాబట్టి ఎన్నార్సి కి కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడినా వచ్చిన నష్టం ఏమీ లేదు. కాబట్టి బీజేపీ బలపడే అవకాశం లేదు. అటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు బలంగా లేవు. ఎన్నార్సిని బీజేపీ వెనక్కు తీసుకోలేదు కాబట్టి తెలంగాణలో బలపడే అవకాశం ఎంత మాత్రం లేదు. ఒకరకంగా బీజేపీని కేసీఆర్ ఇరికించారు.

Read more RELATED
Recommended to you

Latest news