కేసీఆర్ టార్గెట్ వాళ్ళేనా…? రాష్ట్రంలో ఏం జరుగుతుంది…?

-

తెలంగాణలో ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా మారే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అసలు బీజేపీ ఏ విధంగా అడుగులు వేస్తుందో అర్ధం కాక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చలు ఆసక్తికరంగా మారాయి. వాస్తవానికి ఝార్ఖండ్ ఎన్నికల తర్వాత బీజేపీ కేసీఆర్ ని టార్గెట్ చేసే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపించాయి. కేసీఆర్ బలంగా ఉన్నారు కాబట్టి ఆయన్ను ఇప్పటికిప్పుడు ఏమీ చేయకుండా కేవలం సయోధ్య మార్గంలో ఆయన మద్దతు తీసుకోవాలనే భావనలో, బీజేపీ అధిష్టానం ఉందనే ప్రచారం ఎక్కువగానే జరిగింది.

అయితే అది అనూహ్య మలుపు తిరిగింది అంటున్నారు. ఎన్నార్సికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. దీనితో బీజేపీ కేసీఆర్ విషయంలో దూకుడు పెంచింది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత తెలంగాణలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ భారీ సభను నిర్వహించింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించింది. దీనితో ఒక సంకేతం సంఘ్ ఇచ్చేసింది. త్రిపుర మాదిరి సంఘ్ సేవకులు తెలంగాణలో పార్టీ తరుపున ప్రచారం చేయడానికి, బీజేపీని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

త్వరలోనే అమిత్ షా పర్యటన కూడా రాష్ట్రంలో ఉంటుంది అంటున్నారు. కొంత మంది నేతలను కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీనితో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించి, బీజేపీని క్షేత్ర స్థాయిలో అడ్డుకోవాలని, మైనారిటి దళిత వర్గాలను బీజేపీకి దూరం చెయ్యాలని, అందుకోసం ఎన్నార్సి, క్యాబ్ ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా, వలసవాదుల్లో, మైనార్టీ వర్గాల్లో బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కేసీఆర్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. తనను టార్గెట్ చేస్తే మాత్రం రాష్ట్రంలో బిజెపిని పెకలించాలి అనే టార్గెట్ కేసీఆర్ పెట్టుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news