తెలంగాణాలో ఇప్పుడు బిజెపి బలపడాలని చూడటం తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి కాస్త చికాకుగానే ఉంది. తెలంగాణాలో ఏ మాత్రం బలం లేని ఆ పార్టీ ఎంత సేపు తెరాస నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని తమ పార్టీలోకి తీసుకోవాలని ఆలోచించడం కెసిఆర్ ని చికాకు పెడుతుంది. దీనితో ఆయన బిజెపికి ఎప్పటికప్పుడు దారులు మూసేస్తున్నారు. రాజకీయంగా తనకు ఎప్పుడు ఇబ్బందులు లేకుండా చేసుకునే కెసిఆర్, బిజెపికి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి అంటూ ఆయన నేతలకు కీలక హెచ్చరికలు చేసారు. తాజాగా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక్క సీటు పోయినా సరే పదవి పోతుందని మంత్రులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని చెప్తూ, వెన్నుపోటు పొడిస్తే మాత్రం సహించేది లేదని, పూర్తి బాధ్యత మంత్రులదే అని చెప్తూ హెచ్చరించారు. అలాగే అభ్యర్ధుల ఎంపిక నుంచి, బుజ్జగింపుల వరకు ప్రతీ బాధ్యతను వారికే అప్పగించారు.
అసలు ఆయన ఆ విధంగా సీరియస్ గా ఉండటానికి ప్రధాన కారణం, బిజేపినే. బిజెపికి ఎక్కడా అవకాశం ఇవ్వోద్దనే ఉద్దేశం కెసిఆర్ ది. అలాగే కాంగ్రెస్ ని కూడా ఈ ఎన్నికల ద్వారా చంపెయ్యాలనే భావనలో కెసిఆర్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటు గా వస్తే తెరాస ని బిజెపి ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. అందుకే కెసిఆర్ అంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ ఎన్నిక, ఆర్టీసి సమస్య పరిష్కారం ద్వారా కెసిఆర్ బిజెపికి దారులు మూసేసినా, రాష్ట్రంలో ఆర్ ఎస్ ఎస్ అడుగు పెట్టింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికల్లో తెరాస విజయం సాధించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.