నిమ్స్ దశాబ్ది బ్లాక్‌కు శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ మిడతల దండుపై ఆసక్తికరమైన కథనాన్ని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ అంటూ మిడతల దండుపై మాట్లాడారు. తనకు ఒక విచిత్రమైన అనుభవం ఉందని, మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదన్నారు. వెనుకటి కాలంలో ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత బెడద లేదన్నారు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తుంటుందని చెబుతూ… తాను చాలా ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెబుతున్నానని తెలిపారు.
ఈ మిడతల దండు హర్యానాలోకి వచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తోందన్నారు. భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నామని, ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారని తెలిపారు. వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపించామని, మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదన్నారు. అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు తమను కలిసి తమకు హెలికాప్టర్ ఇచ్చి, మమ్మల్ని గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యావాదాలు చెప్పారని వెల్లడించారు.
నిమ్స్ దశాబ్ది బ్లాక్‌కు శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ మిడతల దండుపై ఆసక్తికరమైన కథనాన్ని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ అంటూ మిడతల దండుపై మాట్లాడారు. తనకు ఒక విచిత్రమైన అనుభవం ఉందని, మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదన్నారు. వెనుకటి కాలంలో ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత బెడద లేదన్నారు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తుంటుందని చెబుతూ… తాను చాలా ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ చెబుతున్నానని తెలిపారు. ఈ మిడతల దండు హర్యానాలోకి వచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తోందన్నారు. భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నామని, ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారని తెలిపారు. వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపించామని, మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదన్నారు. అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు తమను కలిసి తమకు హెలికాప్టర్ ఇచ్చి, మమ్మల్ని గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యావాదాలు చెప్పారని వెల్లడించారు.