నేటి తరానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం ఆదర్శం : ముఖ్యమంత్రి కేసీఆర్

-

నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు.ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ సాధనకు జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్​ బాపూజీ.. తెలంగాణ గర్వించే గొప్ప నేత అని కేసీఆర్​ కొనియాడారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి, నిస్వార్థ సేవలను.. కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే చాకలి ఐలమ్మ సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన, సహకార రంగాల పటిష్ఠతకు.. జీవితాంతం కృషి చేశారని తెలిపారు.

కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న ముఖ్యమంత్రి.. ఉద్యానవన విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news