పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ పత్తి రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగిలో వరిని వేయద్దని రైతాంగానికి సూచించిన కేసీఆర్ పత్తిని మాత్రం సాగు చేయాలని సూచించారు. తెలంగాణలో పండిన పత్తికి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లో ఉందన్నారు. రైతులు పత్తిని సాగు చేయాలన్నారు. కోటి ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారని..మరింత పెరిగినా ఇబ్బంది లేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 28 జిన్నింగ్ మిల్లులు ఉంటే ప్రస్తుతం పత్తి జిన్నింగ్ మిల్లుల సంఖ్య రాష్ట్రంలో 400 పెరిగిందన్నారు. ఒక వేళ సీసీఐ కొనుగోలు చేయకున్నా మేం కొనుగోలు చేస్తామని ప్రైవేటు వ్యాపారులు చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. గతంలో పత్తి వేయమని నేనే చెప్పాను… ప్రస్తుతం ఇది నిజమవుతుంది కదా… పత్తికి ధర రూ. 8 వేలను దాటింది కదా.. అని సీఎం కేసీఆర్ అన్నారు.

kcr

వివిధ దేశాల్లో పత్తి ఒకే సారి తీసే విధంగా పంటను పండిస్తున్నారన్నారు. తెలంగాణలో కూడా ఒకే సారి తీసే విధంగా పత్తిని సాగు చేయాలన్నారు. ఇలా చేస్తే రైతులకు కూలీల కష్టం తప్పుతుందని అన్నారు. వచ్చే ఏడాది దాదాపు 50 వేల ఎకరాల్లో ఇదే రకంగా సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news