ఆ విషయంలో కేసీఆర్ యూపీ సీఎం యోగి సలహాలు తీసుకోవాలి: బండి సంజయ్

-

తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారం జరగని రోజంటూ లేదని,వీటిపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని మండిపడ్డారు బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. హైదరాబాదులోని ఎన్టీఆర్ నగర్ లో ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఆదివారం సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాచారాల నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే, నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారిన యోగి ఆదిత్యనాథ్ ను స్పూర్తిగా తీసుకోవాలని కేసీఆర్ కు సూచించారు.

నేరాల పట్ల కఠినంగా వ్యవహరించక పోవడం, ఘటన జరిగిన వెంటనే స్పందించకపోవడం వల్లే రాష్ట్రంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతగానితనం వల్ల హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తింటుందని విమర్శించారు. అత్యాచార ఘటనల్లో ఎంఐఎం, టిఆర్ఎస్ నాయకుల సంబంధీకులే ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందన్నారు బండి సంజయ్. రాష్ట్ర ఖజానాను దివాలా తీయించి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. జాతీయ పార్టీ అంటూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news