రైతులు రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్ భావిస్తున్నారు – గుర్నామ్ సింగ్

-

దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉందన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షులు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పేదలు, రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, పేదలకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు.

తెలంగాణ లో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్ దేశానికి అందజేయాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు గుర్నామ్ సింగ్. ఆరు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హర్యానా, పంజబ్, బీహార్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర పై మొదటగా దృష్టి సారించామన్నారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. రైతుల నుంచి బీఆర్ఎస్ పట్ల మంచి స్పందన వస్తుందన్నారు. దేశంలో ప్రతి మూలకు భారత రాష్ట్ర కిసాన్ సమితిని తీసుకువెళతామన్నారు. త్వరలో బీఆర్ఎస్ విధానాలను కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news