భూముల రేట్లు.. ఆస్తుల ధరలు పడిపోతాయి జాగ్రత్త : కేసీఆర్

Join Our COmmunity

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఅర ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ సభలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ కుటుంబ పెద్దగా నా విజ్ఞప్తి, పిచ్చి ఆవేశాలకు పోకండి, రెచ్చగొట్టే మాటలకు లొంగకండి భూముల రేట్లు పడిపోతాయి.. ఆస్తుల ధరలు పడిపోతాయి అని హెచ్చరించారు. మంచి అభ్యర్థులను పెట్టినం.. గెలిపించండి అని కేసీఆర్ కోరారు.  ఏకపక్షంగా ఇంకో 5 సీట్లు ఎక్కువ ఇచ్చి ఆశీర్వదించండని ఆయన కోరారు.

వెకిలి మాటలు..సమాజాన్ని విభజించే మాటలకు లొంగకండన్న అయన హైదరాబాద్ మీది.. దీన్ని యువత కాపాడుకోవాలి నన్ను కూడా..రారా పోరా అంటున్నారు కానీ నేను మాట్లాడటం లేదు నేను తల్చుకుంటే దుమ్ము దుమ్ము… నశం కింద కొడతా అని ఆయన అన్నారు. మాకు బాసులు ప్రజలు..మా బాసులు ఢిల్లీలో ఉండరు అని అన్నారు.  మీ చిల్లర మాటలకు టెంప్ట్ కామన్న ఆయన మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కానీ… మేము టెంప్ట్ కావడం లేదని అన్నారు. గతంలో కంటే నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయి, గెలిచాక కొత్త జవసత్వాలు తో మళ్ళీ మొదలుపెడతామని అన్నారు. 

 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news