కమ్యూనిస్టులకు 4 అసెంబ్లీ సీట్లు ఇవ్వనున్న కేసీఆర్‌ ?

-

కమ్యూనిస్టులతో టీఆర్‌ఎస్‌ పార్టీ పొత్తు పెట్టుకుని.. మునుగోడు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఫార్ములాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. అమలు చేయాలని.. సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే, వామపక్షాల ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కూడా పరిశీలిస్తున్నారని, వారికి కూడా నాలుగైదు సీట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి చాడ వెంకటరెడ్డి, పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ సెగ్మెంట్ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎర్ర పార్టీలకు బాగా బలం ఉండగా, విజయం సాధించేంత సత్తా అయితే లేదు. దీంతో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా గెలుపొందవచ్చని, దీనివల్ల రాష్ట్రంలో సత్త చూపించుకోవచ్చని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో వామపక్ష పార్టీల పొత్తు ఉంటుందా? లేదా? అనేది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news