కొన్ని కొన్ని నిర్ణయాల ప్రభావం అప్పుడే కనపడదు. ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ఇంకుడు గుంతల నిర్ణయం ప్రభావం ఇప్పుడు కనపడినట్టు తెలంగాణా సిఎం కేసీఆర్ తీసుకున్న గ్రామ ప్రగతి నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తుంది అనేది వాస్తవం. గ్రామాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్న కేసీఆర్ ప్రతీ గ్రామం కూడా అద్దం లా ఉండాలని అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు.
పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అని భావించారు కేసీఆర్. వెంటనే యుద్ద ప్రాతిపదికన గ్రామాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. అన్ని గ్రామాల్లో ఇప్పుడు చాలా వరకు పరి శుభ్రత ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. పట్టణాల్లో కూడా చెత్త అనేది ఎక్కడా లేదు. గ్రామ ప్రజల సహకారం తీసుకుని శుభ్రం చేసారు. గ్రామాల్లో ఉన్న దరిద్రం మొత్తం దాదాపుగా పోయింది. ఈ విషయం విపక్షాలు కూడా అంగీకరించాయి.
ఎక్కడా దుర్గంధం అనేది లేకుండా పోయింది. గ్రామాల్లో జనాలకు ఇబ్బంది అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు గ్రామాల్లో జనాలు ఉంటున్నా దోమల ప్రభావం అనేది ఎక్కడా లేదు. ఇక వైరస్లు బ్రతికే అవకాశం కూడా గ్రామాల్లో లేకుండా జాగ్రత్తలు పడ్డారు. మురుగు నీరు అనేది ఎక్కడా లేదు. గ్రామాలు కూడా కరోనా రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఇళ్ళల్లో ఎక్కువగా ఉన్నా సరే ఇబ్బంది పడటం లేదు.
పట్టణ ప్రాంతాలు కూడా ఇప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాయి. దోమల ప్రభావం, పందుల గోల ఎక్కడా లేదు. ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఒక భయం ఏర్పడింది. అందుకే జాగ్రత్తలు పడ్డారు. అధికారులు కూడా ఇప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. కరోనా విషయంలో పరిశుభ్రత అనేది చాలా కీలకం. గ్రామాలు శుభ్రంగా ఉండటం ఇప్పుడు ప్రజలను ఊపిరి పీల్చుకునే విధంగా చేసింది.