ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పార్టీ రంగులు వేయడం తీవ్ర దుమారం రేపింది. ఇక ఇది సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళడంతో ఏపీ సర్కార్ పరువు పోయింది అని కొందరు కామెంట్స్ కూడా చేసారు. ఈ నేపధ్యంలో తెలంగాణా సిఎం కేసీఆర్ రంగుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ఉమెన్ బయోటాయిలెట్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది…
ఇంటి నుంచి బయటకు మహిళ వస్తే వాళ్ళు టాయిలెట్ కి వెళ్ళే విషయంలో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో… ఈ ఆలోచన చేసారు. అయితే ఈ బస్సులకు గులాబీ రంగు వేసింది ఆర్టీసి. దీనితో దీన్ని గుర్తించిన సిఎం కేసీఆర్… గులాబీ రంగులు తొలగించాలని మంత్రి పువ్వాడ అజయ్ కి ఆదేశాలు ఇచ్చారు. ఆయనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు కేసీఆర్.