తెలంగాణలోని బీసీల కోసం కేసీఆర్ కొత్త పథకం తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. వెనుకబడిన కులాల ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించేందుకు యోచిస్తున్నారు.
బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ఉన్న అడ్డంకులను దూరం చేయడంతో పాటు ఆయా వర్గాల వారు ఆర్థిక స్వావలంబన సాధించేలా అద్భుత పథకానికి శ్రీకారం చుట్టడం ద్వారా కుల వృత్తుల పరిరక్షణతో పాటు, జీవనోపాధికి వీలుగా 100% రాయితీతో నేరుగా సర్కారే వారికి ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
జిల్లాల వారిగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఈ మేరకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ చేసిన ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. వీలైతే.. బీసీల కోసం ప్రత్యేకంగా పథకం పెట్టి.. డబ్బులు అందించాలని ఆలోచన చేస్తున్నారట.