మొదలైన కేదార్‌నాథ్‌కు ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ బుకింగ్..!

-

కేదార్‌నాథ్ ధామ్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ సేవల్ని అందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ బుకింగ్‌ను ఐఆర్‌సీటీసీ మొదలు పెట్టింది. ఏప్రిల్ 25 నుంచి 30 దాకా సీట్లు అందుబాటులో ఉన్నాయి. యమునోత్రి, గంగోత్రి ఆలయాలను ఏప్రిల్ 22న తెరవడంతో యాత్ర మొదలు కానుంది. కేదార్‌నాథ్ ధామ్ 2023 ఏప్రిల్ 25న ప్రారంభం అవ్వనుంది. బద్రీనాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 27న ఓపెన్ కానుంది.

లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వస్తుంటారు. ఇప్పటికే లక్షలాది భక్తులు చార్ ధామ్ యాత్ర లో పాల్గొనడానికి లక్షలాది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారని తెలుస్తోంది. కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సేవల్ని ఇప్పుడు బుక్ చేసేయచ్చు. https://heliyatra.irctc.co.in/ వెబ్‌సైట్ ని తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో మీరు బుక్ చేయాల్సి ఉంటుంది. అయితే హెలికాఫ్టర్ సేవల కోసం టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్, స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ వాట్సప్ సర్వీస్‌లో రిజిస్టర్ చేయాల్సి వుంది.

పర్యాటకులు Yatra అని టైప్ చేసి 918394833833 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ ని పంపాలి. ఇక ధరల విషయానికి వస్తే… గుప్త్‌కాశీ నుంచి కేదార్‌నాథ్‌కు రూ.7,740, ఫట నుంచి కేదార్‌నాథ్‌కు రూ.5,540 గా వుంది. అలానే సేర్సి నుంచి కేదార్‌నాథ్‌కు రూ.5,498. ఇది ఇలా ఉంటే ఐఆర్‌సీటీసీ టూరిజం చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలని మీరు అనుకుంటే ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. న్యూ ఢిల్లీ, హరిద్వార్, ముంబై, రాయ్‌పూర్ నుంచి ప్యాకేజీలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news