ఉక్రెయిన్‌పై అమెరికా వ్యూహాలు లీక్‌.. విచారణకు ఆదేశించిన పెంటగాన్‌

-

అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక రహస్య పత్రాలు లీక్‌ కావడం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేకెత్తిస్తోంది. సైనిక నిఘా సంస్థలు రూపొందించిన ఆ పత్రాలు సామాజిక ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అధిక భాగం.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించినవే కావడం గమనార్హం. ఈ పోరులో రష్యా, ఉక్రెయిన్‌ సైనికుల మరణాల సంఖ్య, ఆయుధ సంపత్తికి సంబంధించిన డేటా, ఉక్రెయిన్‌కు అమెరికా అందించిన అస్త్రాలు, శిక్షణ సహాయం, సైనిక వ్యూహాలు, మ్యాప్‌లు, ఫొటోలు వంటివి లీకైన పత్రాల్లో ఉన్నాయి.

‘టాప్‌ సీక్రెట్‌’గా వర్గీకరించిన ఈ ‘పత్రాలు లీక్‌ కావడం జాతీయ భద్రతకు పెను ముప్పు అని పెంటగాన్‌ వ్యాఖ్యానించింది. అవి సీనియర్‌ నేతలకు సమర్పించిన దస్త్రాల తరహాలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పత్రాల లీకేజీ విషయం బహిర్గతం కాగానే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌.. తమ మిత్రపక్షాలను అప్రమత్తం చేశారు. ఈ లీకేజీ ఎలా జరిగిందో తేల్చడానికి పెంటగాన్‌ విచారణకు ఆదేశించింది. ఈ పత్రాల వెల్లడి నేపథ్యంలో తమ సైనిక ప్రణాళికల్లో కొన్నింటిని మార్చేశామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news